* * *
జరిగిన కథ : బిట్టు ఢిల్లీ కుర్రాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ల ఊరు పోరంకికి వచ్చాడు, వేసవి సెలవలు గడిపి వెళ్ళేందుకు. ఇక్కడ వాడు రకరకాల సంగతులు నేర్చుకుంటున్నాడు. మొన్న పిచ్చుకలు దొరికాయి వాడికి. అంతకుముందు ఓ కుక్క దొరికింది. దానికి రెయిన్ బో అని పేరు పెట్టుకున్నాడు. పక్కింటి అమ్మమ్మ పేరు జయమ్మమ్మ. ఆవిడే, పిచ్చుకల్ని బయట పడేసింది.. ఇక చదవండి.
మర్నాడు జయమ్మమ్మ వచ్చింది- రమ్యనీ, రాహుల్ ని తీసుకుని. ఆవిడ వచ్చేసరికి బిట్టు పిచుకల దగ్గర ఉన్నాడు. ‘నేను బయట పడేసిన పిచుకల్ని నువ్వు ఇంట్లోకి తెచ్చుకున్నావా?’ అని జయమ్మమ్మ తిడుతుందేమో అనుకొని కొంచెం చిన్నబోయాడు బిట్టు.
‘ఏమిటి, ఆ పిచుకల్ని ఇక్కడ తెచ్చిపెట్టావా?’ అంది ఆమె కొంచెం ఆశ్చర్య పోతున్నట్లు. బిట్టు అమ్మమ్మ వైపు చూసాడు. ‘అవును జయా, వీడు ఎప్పుడూ పిచుకల్ని చూడలేదుట. వీడు ఉన్నన్నాళ్లూ వీటిని పెంచుకుంటాడట’ అంటూ నవ్వింది అమ్మమ్మ, వాతావరణాన్ని తేలిక చేస్తూ.
బిట్టూ రమ్యని, రాహుల్ని దగ్గరికి పిలిచి పిచుక పిల్లల్ని చూపించాడు. వాళ్ల వెనకే ఇల్లంతా తిరుగుతున్నాడు రెయిన్బోగాడు. జయమ్మమ్మ కొంచెం విసుక్కుంది: ‘ఈ పిచ్చి కుక్క ఎక్కడిది? పెంచుకోవాలంటే మంచి జాతి కుక్కని తెచ్చి పెట్టుకోవాల్సింది’ అని.
బిట్టుకి జయమ్మమ్మ మాటలు నచ్చలేదు. కానీ తాతయ్య చెప్పారు కదా, పెద్దవాళ్ల మాటలకి కోపం తెచ్చుకోకూడదని?! అందుకని ‘ఎలాగైనా సరే, రెయిన్బోగాడు జయమ్మమ్మకి కూడా…
View original post 900 more words