* * *
వర్షం ఆగకుండా నిలబడి కురుస్తోంది.ఎందుకో మనసంతా దిగులు దిగులుగా ఉంది.తెలవారిందో లేదో తెలియనీయని చిక్కని మబ్బులు తమ సొద ఏదో చెప్పుకుంటూ ఈ వర్షపు ఉదయయానికి గుబులు పులుముతున్నాయి.
బాల్కనీలోకి చిన్నజల్లు కూడా రావటంలేదు.ఉయ్యాలలో మరింత సర్దుకుని కూర్చుంది శైలజ.ఆమెభర్త చంద్ర పనుందంటూ పెందరాళే ఆఫీసుకి బయలుదేరాడు.సంవత్సరం గ్యాప్ తర్వాత ఇంటికి వచ్చిన కొడుకు రాహుల్ రెండురోజులు మురిపించి వెళ్లిపోయాడు.ఒంటరితనం ఒక్కటే బెంగల్ బెంగల్ కి కారణమా? కాదులే,అది కూడా ఒక కారణమంతే.
బెంగల్, బెంగల్… పుష్కరం క్రితం ఈపదాన్ని కనిపెట్టింది రేణు కదూ.అమ్మానాన్నలకి, తమ్ముడికి బై బై చెప్పి యూనివర్సిటీ చదువుకి హాయిగా వెళ్లిపోయింది. భోజన సమయంలో కన్నీళ్లెట్టుకునే భార్య బెంగల్ చూడలేక డైనింగ్ టేబిల్ దగ్గర కూతురురేణు కూర్చునే నాలుగో కుర్చీ తీసి కంటికి కనిపించకుండా దాచేసేడు చంద్ర. హాస్టల్ లో ఉన్న రేణుని ఫోన్ లో పలకరించినపుడు కిలకిలా నవ్వుతూ కబుర్లు చెప్పేది, ‘ఎందుకమ్మా బెంగల్ బెంగల్ నీకు’ అని అడిగేది పైగా. ఈ పిల్లకి తల్లి బాథ అర్థం కాదా అని వాపోయేది ఆమె.
ఇంట్లో అన్నేళ్లుగా విసిగించిన పిల్లలఅల్లరి మిస్ అవటం ఆమెకి మరింత అలసటని, అసహనాన్ని కలిగించేవి. ఆ తర్వాత రాహుల్ చదువుకోసం దూరంగా వెళ్లినప్పుడు ముందులా కాకుండా కొంచెం స్థితప్రజ్ఞతతో తీసుకోగలిగింది. అదేదో సహజమైనదే అన్న తెలివిడి వచ్చి గంభీరంగా ఉండిపోయింది. ఈ పిల్లలు ఇంతే. మనసంతా ఒక…
View original post 1,191 more words