* * *

ఆరోజు బిట్టు నిద్ర లేచేసరికి ఇంటి ప్రహరీ గోడ మీది నుండి ప్రక్కింటి వాళ్లతో మాట్లాడుతోంది అమ్మమ్మ. బిట్టుకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇంట్లో ఎవరుంటారు? తను వచ్చి ఇన్నాళ్ళైంది కదా, ఇప్పటిదాకా ఆ ఇంట్లోవాళ్ళు ఎవ్వరూ తనకు కనిపించనే లేదు!
కొద్ది సేపటికి అమ్మమ్మ కబుర్లు పూర్తిచేసుకొని లోపలికి వచ్చింది కదా, అప్పుడు ఆవిడ చేతిలో అరటికాయలు కనిపించాయి బిట్టుకి. ‘అవేమిటి? ఎక్కడివి?’ అంటూ ప్రశ్నలు వేసాడు అమ్మమ్మని.
‘ప్రక్కింటి జయమ్మమ్మ వాళ్లు ఇన్నాళ్ళూ ఊరెళ్ళారు కదా, ప్రొద్దున్నే వచ్చారు. వాళ్ల పెరట్లో కాసాయట, అరటి కాయలు. మనకు కొన్ని ఇచ్చారు. వాళ్ల మనవడు, మనవరాలు రేపు వస్తున్నారుట, ఇల్లంతా శుభ్రం చేయించుకుంటున్నారు. పిల్లలు వచ్చాక వాళ్లని మనింటికి తీసుకొస్తానంది జయమ్మమ్మ. చిట్టి, దావీదులతో పాటు వాళ్ళు కూడా నీతో కలిసి ఆడుకుంటారు.’
అమ్మమ్మ మాటలతో బిట్టుకి క్రొత్త ఉత్సాహం వచ్చింది. కొత్త స్నేహితులొస్తున్నారనమాట! మధ్యాహ్నానికల్లా కొంచెం హడావుడి వినిపించి ప్రక్కవాళ్ల ఇంటి వైపుగా చూసాడు. ఓసారి వాళ్ళింటికే వెళ్లి చూసి వద్దామని కూడా అనుకున్నాడు. ఆ మాటే పైకి అనేసాడు; కానీ అమ్మమ్మ వెళ్లొద్దంది: ‘వాళ్ళు ఈ పూటే కదా వచ్చింది?! ఇల్లంతా సర్దుకునే హడావుడిలో ఉంటారు. నువ్వు వెళ్లి అడ్డం పడకు. రేపు కలవచ్చులే’ అని. సాయంత్రం నాలుగవుతోంది. ప్రక్క వాళ్ళింట్లో జయమ్మమ్మ కాబోలు, పెద్ద పెద్దగా ఏదో అంటోంది కమలమ్మతో. చిట్టి అక్కడే…
View original post 820 more words