* * *
జరిగిన కథ : ఢిల్లీ లో ఉండే బిట్టు, వాళ్ల అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. దావీదు అనే పిల్లాడు సైకిల్ రిపేరు చేసి, తాతయ్య దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు. దాంతో వాడు బిట్టుకి శత్రువైపోయాడు. కానీ అమ్మమ్మకి వాడి గురించి తెలీదు.. ఇక చదవండి, ‘..దావీదు”- రెండో భాగం. “ఆ రోజు తాతయ్యతో వీడు ఎట్లా మాట్లాడాడో తెలుసా, నీకు అసలు?” అని అమ్మమ్మని కోపంగా అడుగుదామనుకు-న్నాడు బిట్టూ. కానీ ‘ఎవరి గురించైనా అట్లా చెడ్డగా చెప్పటం బావుండద’ని ఊరుకున్నాడు.
‘అయినా అమ్మమ్మా, బట్టలు ఉతికేందుకు వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చుగా, వీళ్లతో చేయించుకునేదెందుకు?’ అన్నాడు, అమ్మమ్మకి సులువు చెబుతూ.
‘ఎందుకురా, మనకు ఎన్నో ఏళ్లుగా బట్టలు కమలమ్మే ఉతుకుతోంది. మనం మిషన్ కొనుక్కున్నామంటే మరి ఆవిడ చేతిలో పని పోతుంది కదా!
అయినా, నలుగురూ ఇంటికొచ్చి వెళ్తూంటే ఇల్లంతా సందడిగా బావుంటుంది- ఒట్టి మిషన్లతో ఏం బావుంటుందిరా? మీకైతే, మరి సిటీలో బట్టలు ఉతికే మనుషులు కావాలన్నా దొరకరు; దొరికినా ఇంట్లో కూర్చుని ఉతికించుకునే తీరిక కూడా ఎవరికీ ఉండదు- అందరూ ఉద్యోగాలకి పరుగెడతారు కదా; మరి ఇక్కడైతే అట్లాంటి హడావిడి ఉండదు: చాలామంది నాలాగే బట్టలు ఉతికించుకుంటారు’ అంది అమ్మమ్మ.
“నలుగురూ ఇంటికి వచ్చి వెళ్తుంటే ఇల్లంతా సందడిగా బావుంటుంది” అని అమ్మమ్మ చెప్పింది బిట్టుకి కూడా నచ్చింది..
“నిజమే..దిల్లీలో అయితే ఎవరి ఇంటికి…
View original post 876 more words