* * *
- కలత నిద్రలో ఒత్తిగిలితే,
పెరట్లో అమ్మ నాటిన గులాబీ
కంటిముందుకొచ్చింది చిత్రంగా!
ఆ వెనుకే లైబ్రరీ మెట్లమీద నీ చిరునవ్వూ!
- ఈ చందమామ, ఈ నక్షత్రాలు, ఈ పువ్వులు,
ఈ వాన చినుకులు, ఈ ఏడు రంగుల హరివిల్లూ
నీ వెనుకే కదూ పుట్టుకొచ్చాయి!
- నీ అమాయకపు ముఖం చూసి
గాలికి కదిలే చిరు మేఘమనుకున్నా,
ఉప్పెనై నన్ను కమ్ముకుని
ఊపిరాడనివ్వని తుఫానువవుతావనుకోలేదు!
- వేళకాని వేళ విసిగించే నల్లమబ్బు
నీ పరిచయంతో
చల్లని వానజల్లై పలకరిస్తోంది!
- మానవాళికి హంగులిచ్చే నేను
ప్రపంచానికి రంగులద్దే నువ్వు
ఇద్దరం ఏనాడో సహప్రయాణీకులమయ్యాం!
- విశ్వ రహస్యాల్ని వెదికే నేను,
మస్తిష్కపు సమాధానాల్ని పట్టుకొచ్చే నువ్వు
ఏ సరిహద్దు మీద కలుస్తాం?!
- రహదారి పొడవునా
తలలూపి పలకరించే గడ్డిపువ్వుల్ని
అంత సున్నితంగా పలకరిస్తావెందుకు?
అవి నాముందే నీ చేతిని తాకుతుంటే
ఎందుకో ఎప్పుడూ ఎరగని కంటి చెమ్మ తగులుతోంది!
- ఇన్నేళ్లూ నువ్వు నడిచిన దారులు,
నీ చుట్టూ పరుగులెత్తిన లేత గాలులు,
నిన్ను దర్శించిన సూర్యోదయ, సూర్యాస్తమయాలు,
నాకంటే ఏం పుణ్యం చేసుకున్నాయంటావ్? నిజం చెప్పు!
అనువాదంః రచన సోమయాజుల
* * *
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike