* * *
భవానీ ద్వీపం పేరు మీరు వినే ఉంటారు. విజయవాడ సమీపంలో కృష్ణానదిలో ఉంది ఇది. పెద్ద పెద్ద నదీ ద్వీపాల్లో భవానీ ద్వీపం ఒకటి. విజయవాడ లాటి ఊళ్లో ప్రజలకి ఒక పిక్నిక్ లాటిది జరుపుకుందుకు ఎలాటి బహిరంగ ప్రదేశం లేదనే వారికి ఇది చక్కని ఆటవిడుపు. దశాబ్దం క్రితం అభివృధ్ధి చేసినా ప్రజలకి అంతగా దీనిపట్ల అవగాహన లేదని చెప్పవచ్చు.
*
ఒక మూడు సంవత్సరాల క్రితం కార్తీక మాసం వనభోజనం పేరుతో వెళ్లినప్పుడు అక్కడ జనం చాలా పలుచగా ఉన్నారు. చుట్టూ పచ్చదనం, పిల్లలకి, పెద్దలకి అవసరమైన అనేక క్రీడలకు అనువైన ఏర్పాట్లు ఉన్నాయి, కాని జనం మాత్రం లేరు.
*
భవానీ ద్వీపం 133 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వసతి నిమిత్తం ఎ.సి., నాన్ ఎ.సి. కాటేజీలు ఉన్నాయి. ట్రీ టాప్ కాటేజీలు ఆకర్షణీయంగా ఉన్నాయి. రెండు, మూడు వేల ధరలో కాటేజీలు దొరుకుతున్నాయి. బఫే బ్రేక్ ఫాస్ట్ కాటేజీ ధరలో ఉచితంగా దొరుకుతుంది. ద్వీపం చేరేందుకు చేసే పడవ ప్రయాణానికి కాటేజీ బుక్ చేసుకున్నవారు రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.
24 గంటలూ చెకిన్ అయ్యే సౌకర్యం ఉంది. భోజనం , సర్వీస్ విషయంలో మరింత ప్రమాణాల్ని పాటించవలసిన అవసరం ఉంది. భద్రత విషయంలో సమస్య లేదు. అవసరమైన చిన్న చిన్న వస్తువులు సబ్బులు లేదా పిల్లలకి కావలసిన బిస్కెట్లు లాటివి అమ్మే దుకాణాలు ఏర్పాటు చెయ్యవలసిన అవసరం ఉంది.
*
పున్నమి ఘాట్ నుండి పడవలో ఒక 40 రూపాయల ఖర్చుతో ద్వీపం వరకు వెళ్లి రావచ్చు. మనకు కావలసినంత సమయం గడపవచ్చు. అక్కడ ఒకటి రెండు రోజులు ఉండాలన్నా సదుపాయం ఉంది. రెండు రెస్టోరెంట్లు కూడా ఉన్నాయి.
*
ఈ సంవత్సరం అదే కార్తీక మాసంలో వెళ్లినప్పుడు అక్కడ జనసందోహం చాలా ఎక్కువగానే కనిపించింది. చిన్నా, పెద్దా కూడా ఉన్నారు. మనకు కావలసిన భోజన సదుపాయాలు భవానీ ద్వీపంలోనే జరుగుతాయి. ముందుగా అక్కడి పర్యాటక శాఖ వారికి చెప్పుకుని ఆ సదుపాయాన్ని పొందవచ్చు. భోజనం ఖరీదు తగుమాత్రంగా, అందరికీ అందుబాటులో ఉంది. భోజనం ప్రమాణాలు కూడా బావున్నాయని చెప్పచ్చు.
*
ఇక్కడికొచ్చే పర్యాటకులను తృప్తిపరిచి వాళ్లను మళ్లీ మళ్లీ ఆకర్షించేందుకు పర్యాటక శాఖ వారు ఇప్పుడిప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అతిథుల కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నారు. వీటిని ఉచితంగానే అస్వాదించే సదుపాయం కలిగిస్తున్నారు.
*
ఇక్కడ పెళ్లి నిశ్చితార్థం, పుట్టిన రోజు వేడుకలు లాటివి కూడా జరుగుతున్నాయి. మరోవైపు కవితాగోష్టులు జరుగుతున్నాయి.
*
ద్వీపంవరకూ జనాన్ని చేరవేసేందుకు అనేక పడవలు, డబుల్డెక్కర్ కూడా ఉన్నాయి.అనేక నీటి క్రీడలు, చెట్ల మీద రోప్ వాక్ వంటి అనేక క్రీడలున్నాయి.
*
కృష్ణానదిలో నెమ్మదిగా కదిలే పడవలో ప్రకాశం బ్యారేజీ, కనక దుర్గమ్మ వెలసిన ఇంద్రకీలాద్రి చూసుకుంటూ దూరంగా ద్వీపంలోని పచ్చదనం ఆహ్వానాలు అందుకుంటూ ప్రయాణించటం బావుంటుంది. సుమారు పది పదిహేను నిముషాలు ప్రయాణం ఒక చక్కని అనుభవం.
*
భవానీ ద్వీపం చూడాలంటే పున్నమి ఘాట్ చేరి అక్కడ నుండి పడవలో ద్వీపం చేరుకోవచ్చు. పున్నమి ఘాట్ లో కూడా చక్కని రెస్టోరెంట్ ఉంది. నగర జీవితం నుండి, కాంక్రీటు అరణ్యాల నుండి దూరంగా ఒక ఆకుపచ్చని ప్రపంచంలోకి, ప్రకృతి ఒడిలోకి తిన్నగా వెళ్లాలనుకుంటే భవానీ ద్వీపం మనకున్న మంచి అవకాశం. అక్కడి పచ్చదనం మనసుల్ని, మనుషుల్ని క్రొత్త లోకాల్లోకి తీసుకెళ్తాయి. తాజాగా జీవితాల్నిశ్వాసించే అవకాశం కలిగిస్తాయి. సంవత్సరం పొడవునా ఇక్కడకి పర్యాటకులు రావచ్చు.అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు భవానీ ద్వీపానికి మరింత ప్రచారం చెయ్యవలసిన అవసరం ఉంది.
VERY NICE TO ENJOY THE NATURAL SCENES WITH DETAILS
LikeLike
So happy to know that Vijayawada too has a good picnic spot at last!! Good pictures and detailed report!!
LikeLike
Thank u Seshuji
LikeLike
Very nice to see vijayawada and it’s surroundings developing very beautifully. Article needs more info like if this is open year long? how much area? cleanliness and security is there?
LikeLike
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike