* * *
తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు తాలూకాలో ఉన్న ఆదుర్రు గ్రామం అతి నిశ్శబ్దంగా కనిపిస్తుంది. అక్కడ బౌధ్ధ మతానికి చెందిన అత్యంత విలువైన నిర్మాణాలున్నాయని ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాటి శ్రధ్ధ చూపకపోవటంతో అక్కడి విలువైన బౌధ్ధ స్థూపం అలా ఎదురుచూస్తోంది. అది పదిహేడు అడుగుల వ్యాసం కలిగి జెయింట్ వీల్ ఆకారంలో నిర్మించబడింది. చుట్టూ వేదిక, ఆయకాలు నిర్మించబడి ఉన్నాయి. దీనిని మహాక్షేత్రం అంటారు.
*
మొదటిసారిగా 1923లో ఆర్కిలాజికల్ సర్వే వారు చేసిన త్రవ్వకాల్లో ఈ బౌధ్ధ నిర్మాణాలు బయటపడ్డాయి. ఆ తర్వాత 1953 లోజరిపిన త్రవ్వకాల్లో ఇక్కడి స్థూపాలు, చైత్యాలు, విహారాలు బయల్పడ్డాయి.అంతేకాక ఎర్రని మట్టి కుండలు, పాత్రలు వెలుగు చూసాయి. 1955 సంవత్స్స్రంలో ఈ ప్రాంతాన్ని ఆర్కిలాజికల్ సర్వే వారు రక్షిత ప్రదేశంగా ప్రకటించారు.
*
ఆదుర్రు ను ‘దుబరాజు దిబ్బ’ లేదా ‘దుబరాజు గుడి’ అని కూడా అక్కడి వారు పిలుస్తారు.ఇది గోదావరి నదికి ఉపనది అయిన వైనతేయ నదికి పశ్చిమంగా ఉంది. మామిడికుదురు లోని బంగాళాఖాతానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో ఓ.ఎన్.జి.సి. వారు వేసిన రోడ్లు ఉన్నాయి. కులవ్యవస్థను అనుసరించి గ్రామంలో ఇళ్లు ఉండటం గమనించవచ్చు.
*
ఇక్కడ బౌధ్ధ మతానికి చెందిన అతి ముఖ్యమైన మూలాలు ఉన్నాయి. ప్రపంచంలోని మూడు ప్రఖ్యాత స్థూపాల్లో మొదటిది ఆదుర్రులో ఉంది. రెండవది రాంచీలో, మూడవది సారనాధ్ లో ఉన్నాయి.
*
ఇక్కడి మహాస్థూపం అశోకుడి కాలంలో నిర్మించబడింది.అశోకుని కుమార్తె సంఘమిత్ర శ్రీలంక కు వెళ్తూ ఇక్కడ ఈ స్థూపానికి శంకుస్థాపన చేసింది.
ప్రభుత్వం వారు ఈ విలువైన నిర్మాణాల యొక్క సంరక్షణ బాధ్యత తీసుకోక పోవటంతో ఆదుర్రుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగులు బుధ్ధ విహార ట్రస్ట్ ను ఒకదానిని ఏర్పాటు చేసి ఇక్కడి బౌధ్ధ స్థూపాన్ని, మిగిలిన విలువైన అవశేషాల్ని సంరక్షిస్తున్నారు.ఇది 2400 సంవత్సరాల నాటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన స్థలం అని చెబుతారు.
*
రాజమండ్రి నుండి రాజోలు రోడ్డు మార్గం లో వచ్చి అక్కడి నుండి ఆదుర్రు వరకు ఆ సన్నని రోడ్లపైన ప్రయాణం ఒక చిక్కని అడవిలోకి వెళ్తున్నట్టు ఉంటుంది.చుట్టూ కళ్లు తిప్ప్పుకోనివ్వని ఆకుపచ్చని వనాలు మనసును సేదదీరుస్తాయి. ఊరంతా కూడా చుట్టూ పచ్చని పొలాలతో, రొయ్యల చెరువులతో చూడ ముచ్చటగా ఉంటుంది. డాక్టర్ సదుపాయం లాటివి ఈ గ్రామంలో లేవనే చెప్పారు.
*
ఇక్కడి నుండి గోదావరికి భూమార్గం ఉంది. మహాక్షేత్రం పైన రత్నాలు, నలుచదరపు నిర్మాణాలు ఉన్నాయని చెబుతారు.
బౌధ్ధ మతం పట్ల ఆసక్తి ఉన్నవారు తప్పక చూడదగ్గ స్థలం ఇది. ప్రస్తుతం అమరావతి రాజధానిగా ఎదుగుతున్న దశలో బౌధ్ధ మతానికి ఇస్తున్న ప్రాముఖ్యత అనుసరించి ఆదుర్రును కూడా అభివృధ్ధి చేసి ప్రపంచ పటంలో దాని స్థానాన్ని పటిష్ట పరచ వలసి ఉంది.
Anuradha threw light on the long forgotten treasures!! Nice to read about Aduri in which we find one of the biggest Boudha Stupas..It is also great to know how the locals are taking care of relics..
LikeLike
నమో బుద్దాయ,బహుజన సుఖాయ
LikeLike
Thank u friends.
LikeLike
Interesting information. I could not locate బౌధ్ధ స్థూపం, పదిహేడు అడుగుల వ్యాసం కలిగి జెయింట్ వీల్ ఆకారం in the above article. India has lot of treasures that are not come into light. These article should encourage government to develop and create tourist attractions
LikeLike
Reblogged this on ద్వైతాద్వైతం.
LikeLike