* * *
తిండి, నిద్ర…ఈ జీవితమింతే
అనుభవాల ఖజానా ఖాళీ అయింది,
అనుభూతుల రసస్పర్శలు జీవరహితం అయ్యాయి!
హృదయపు స్పందన సవ్వడి ఆగిపోయింది.
బ్రతుకు బాటలో నైరాశ్యపు గాలుల మధ్య
చిన్నబుచ్చుకున్న మనసుతో అడుగులు వేస్తున్నా….
ఏదో సడి!……………….
వసంతాగమనంలా నువ్వు!
చివుళ్లు తొడుక్కున్న ప్రకృతి పరవశించిపోతూ
సువాసనల చైతన్యంతో సాక్షాత్కారం!
జీవితం మళ్లీ మొదలైంది అనిపించిన క్షణం.!
అంతలో వ్యథాపూరిత భావం….
ఈ బాటలో నీవెందాకా?
నా అడుగుల్లో ఈ లయ ఎందాకా?
మళ్లీ నన్ను నిర్లిప్తత హోరుమంటూ అల్లుకుపోదూ?!
ఈ పూలు, ఈ వెన్నెల, ఈ ప్రాపంచిక పరిమళాలు నావే అనిపించిన క్షణం
నా చేజారిపోతే……….
నువ్వెక్కడ?…నేనెక్కడ?
అందుకే ఈ కవిత అర్థాంతరంగా…………….
Thank u anudeep
LikeLike
Feels like disappointment of mind set and looking for something…
Yeah, truly some days are like that…
LikeLike