* * *
తెలతెల వారుతుంటే పొగమంచు ముసుగులో
ప్రకృతిని చూస్తున్నా….
ప్రపంచ అస్థిత్వం మసక, మసకగా……………..
జీవితానికి అర్థం చెబుతోందా?
క్రితం సాయంత్రం నీకోసం కూర్చిన జాజుల మాల
ప్రకృతిలో వైరాగ్యాన్ని చూసి,
చేజారి, విడివడి, సంకెళ్లని త్రెంచుకున్న
అనుభూతుల వానచినుకలై మనసునెటో లాక్కెళుతుంటే…..
ఏయ్, జ్ఞాపకాల జడివానలో తడుస్తూ
నన్ను మరుస్తున్నావా? అంటూ తెల్లని పొగమంచు నన్ను కమ్మేశింది!
* * *
Remarkable!!
LikeLike