ఒక సామీప్యం

* * * ఆ రాత్రి నిన్నూ నక్షత్రాన్నీ నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నాను! నీ కబుర్ల మాయలో పడి ఆ ఒంటరి నక్షత్రాన్ని కాస్త నిర్లక్ష్యంగానే చూశాను! ఊహకందని దూరానున్న నక్షత్రాన్ని నీ సామీప్యం వెక్కిరిస్తుంటే జాలిజాలిగా చూశాను! ఆకాశం నిండా శరద్రుతువు ఒక మోహపు వెల్లువై కమ్మిన ఈ రాత్రి.... నీ కబురందక ఈ మారుమూల విలవిల్లాడుతున్న నన్ను ఆ నక్షత్రం చూస్తోంది! ఊరుకొమ్మంటూ ఎదుట తానున్నానంటూ ఓదారుస్తోంది! * * *

వియోగం

* * * అకస్మాత్తుగా వస్తావ్! అక్షరాల దొంతరవౖ పలకరిస్తావ్! ఎంతెంత ప్రయాణమై వస్తావ్! ఎన్ని వేల మైళ్లు పరుగులు దీసి వస్తావ్! గుండె చప్పుళ్లు విశ్వమంతా ప్రకంపిస్తుంటే భరించలేని ఉద్వేగాల మధ్య నేనుండగానే నువ్వు నువ్వుగా నా ముందుకొస్తావ్! వియోగంలో కన్నీరవుతానంటావ్! చెమర్చే కళ్లమధ్య అంధుణ్ణవుతాను! ఇక నీ అక్షరాల స్పర్శ నాకు దివ్యత్వాన్నిస్తుంది! * * *

కై, నీకోసం!

* * * ఎవరో, ఎక్కడివాడో తెలియదు, చటుక్కున రాక తప్పదనుకున్న గాలివానలాగే వచ్చాడు! వాడి చూపులు నన్ను చుట్టుకునే ఉంటాయి, నన్ను శిలువని చేస్తుంటాయి! అంతలోనే దిగంతాల్లో ఏ అగోచర దృశ్యాల్నోదర్శిస్తుంటాయి. నాపిలుపుకే విచ్చుకున్నట్లుంటాయి ఆ పెదవులు! ఏ భాషకీ అందని ఎన్నెన్నో సందేశాల్ని అందిస్తుంటాయి ఆ నవ్వులు! ఆ వేలి కొసలు ఏ మాయా మోహాల్నో నాలో ఒణికింపచేస్తుంటాయి! ఏ రాగాలకీ అందని సుస్వరాల్ని ఎక్కణ్ణుంచో అవలీలగా ప్రవహింపచేస్తుంటాయి! వీడోక పాటా? వీడొక ప్రవాహమా? …

Continue reading కై, నీకోసం!

ముద్ర – రచన-కౌముది ఉగాది కవితలు, 2007

* * * చదువు, కెరీరంటూ నాన్న గీసిన గిరులు ధిక్కరించనందుకు లోకం ప్రయోజకుడన్న ముద్ర వేసి, పొంగిపొరలే జీవన భాండాన్ని అందించింది! ఎప్పుడో ఈ అన్ని హోదాల వెనుక , అన్ని పరుగుపందేల వెనుక నిశ్చింతగా పెనవేసుకు నిద్రపోయే భార్యో, కూతురో, ఏ నిద్రపట్టని నిశిరాత్రి నిశ్శబ్దమో, ఏ ఒంటరి సుదూర ప్రయాణమో, నాలోని నన్ను బయటపడేసే యత్నం మొదలెడుతుంది! అప్పుడు, అకస్మాత్తుగా మొదలవుతుంది గుండెపట్టని దిగులు... ఏనాటిదో డైరీ పేజీల మద్య దాచుకున్న తొలి …

Continue reading ముద్ర – రచన-కౌముది ఉగాది కవితలు, 2007

స్వచ్ఛ భారత్ – గూడెం చెప్పిన కథలు

* * * ‘స్వచ్ఛ భారత్’ నినాదం దేశం అంతా మారుమ్రోగిపోతోంది. స్కూల్ కాంపౌండ్ లోపల పెరిగిన పిచ్చిమొక్కలు, గడ్డి తీసివేయించి, టాయిలెట్లు దగ్గరనుంచీ క్లాసురూముల వరకూ శుభ్రం చేసే పనిని యుద్ధ ప్ర్రాతిపదికన మొదలుపెట్టేం స్కూల్లో అందరం. పిల్లలంతా ఉత్సాహంగా పనుల్లోకి జొరబడ్డారు. అన్ని పనులకీ పోటీ పడిన వాళ్లు టాయిలెట్ల దగ్గరకొచ్చేసరికి శుభ్రం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ‘మేం ఇలాటి పని చెయ్యం టీచర్. మా అమ్మకి తెలిస్తే కొడుతుంది. ఆ పని …

Continue reading స్వచ్ఛ భారత్ – గూడెం చెప్పిన కథలు

జీవించేందుకు సూత్రాలేమిటి? – వాకిలి Oct, 2016

* * * తెలతెల వారుతూంటే నిద్ర లేని రాత్రిని విసుక్కుంటూ మంచం దిగి బాల్కనీలోకి వచ్చాను. ఆకాశం దిగులుగా ఉందని తోచింది. నా మనసులో దిగులు ఆకాశానికి పులిమేసి చూస్తున్నానా లేక ఆ మబ్బులు నిజంగా ఆకాశానివేనా? ఇంతలో చటుక్కున వాన చినుకులు ఆరంభమయ్యాయి. నా అశాంతికి మృదువైన లేపనంలా చల్లని జల్లు ముఖాన్ని తాకుతోంది. ఒక్కసారిగా తెలియని ఆనందమేదో నన్ను పలకరించింది. చేతిలో టీ కప్ తో వచ్చి బాల్కనీ అంచున కూర్చున్నాను. ఇష్టంగా …

Continue reading జీవించేందుకు సూత్రాలేమిటి? – వాకిలి Oct, 2016