* * *
మనసును వేగించే ప్రశ్నే లేకపోతే
నిరాహారంగా మెదడు!
కలత నిద్రెరుగని నిద్రా ఒక నిద్రేనా?
సంధించే వాగ్బాణాలూ, పులుముకునే ఆడంబరాలూ
ప్రపంచ శత్రువునెదుర్కొనే సమాధానాలు నీకు!
మంచి మిత్రుడిలాటి పెరటిగాలి మాత్రం
శూన్య హృదయాన్ని ఎంతకని నింపుతుంది?
వెన్నెల చల్లగా కాక ఇంకెలా ఉంటుంది?
మన కక్ష్యలు సమాంతరాలని తెలుసు నీకు!
దారి మళ్లించబోతావెందుకు?
ఈ దారినిండా పరుచుకున్న ముళ్లు,
ఆ దారి కడ్డుగా పోగుపడిన పరిమళాలు
రెండూ రెండే!
రెండు విభిన్న ప్రపంచాలంటావా?
ఇక్కడ బార్టర్ సిస్టమ్ కుదరదంతే!
Nice poem. Barter system!! yeah does not work anymore.
When did it exist, when people acted like humans 😦
LikeLike
Thank u Sridevi
LikeLike