బాధావీచికలా ఓ జ్ఞాపకం!

* * *

విశ్వవిద్యాలయపు పట్టాకోసం ఆఖరి సెమిస్టర్ అయిందనిపించి
వీడ్కోలు దిగుళ్లను గోదారి గాలుల మధ్య దూదిపింజెలా ఎగరేసి
అమ్మ ఒడిలో బధ్ధకంగా ఎడతెగని శెలవులకి నాంది పలుకుతూ
యథాలాపంగా పెరట్లో తలెత్తి చూస్తే……………
నిన్ను ఏ జ్ఞాపకం ఉక్కిరిబిక్కిరి చేసిందో!
మరుపు పొరల్లోకి ఇంకా జారని కాలేజ్ క్యాంపస్
ఏ మెరుపు జాడని కళ్లముందుకు తెచ్చిందో!
చౌరాసియా వేణువు తీయనిపరిమళమై నిన్ను చుట్టుముట్టిన క్షణం!
చిరు తగవుతో మొదలైన పరిచయం……….
నిముషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలైంది!
అకస్మాత్తుగా మొదలై
అర్థాంతరంగా ఆఖరైన ఉత్తరాల పర్వం!
కిటికీలోంచి అనుభూతించే వర్షపు జల్లులా
ఓ చిత్రమైన అనుభవం!
అలవోకగా వీచే గాలి తెమ్మెరై
అప్పుడప్పుడోమారు పరామర్శిస్తూనే ఉంటుంది!
కాకపోతే……………………
చిరకాలపు గాయమై సలుపుతూనూ ఉంటుంది.
నీదంటున్న ఆర్థ్రత బయటపడాలంటే
ఘనీభవించిన నిశ్శబ్దం భళ్లున బ్రద్దలు కావలసిందే!
ఈ లోపు , ‘సున్నితత్వం నా మతం’ అంటే మాత్రం నమ్మబుధ్ధికాదు!

* * *

One thought on “బాధావీచికలా ఓ జ్ఞాపకం!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.