చిగురించిన స్ఫూర్తి!

* * *

ఓ బోలుతనపు శూన్య చిత్రం మనసంతా ఆక్రమించినపుడు-
మరో తోచనీయని ఖాళీతనం గుండెలోకి తొంగి చూసినపుడు-
ఉస్సురంటూ వాలిందో ఎర్రతోక నల్లపిట్ట,
ఎక్కడేక్కణ్ణుంచో ఏ సందేశాల బరువులు మోసుకొచ్చిందో!
నా లోలోపల ఏదో వెదుకులాడుతుంది.
నన్ను వింటుందా? తనని వినమంటుందా?
నిలవనీయని ఏ స్మృతి రేగిందో
అంతలోనే రివ్వుమంటూ ఎగిరిపోయింది!
కమ్ముకొచ్చే సంధ్య చీకటి
వెలుగుపూల అమావాస్యని తోడు తెచ్చింది
బ్రతుకంతా ఆవరించినా ఏ నాడూ పలుకరించని అల్లరి గాలి
ఏమనుకుందో ఏమో?…
ఈలపాట మొదలెట్టింది!
ఎందుకో అప్పుడప్పుడు ఒక బేలతనం ఆవరిస్తూనే ఉంటుంది…
అయినా…………….
ఎప్పటికప్పుడు వెన్ను తట్టే ఈ ప్రకృతిని చూస్తే
జీవితం మళ్లీ చిగురించిన స్ఫూర్తి!

* * *

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.