* * *
ఆశల రెక్కల విమానమెక్కుతూ
అనుబంధాల నిచ్చెన ప్రక్కకి జరిపేవ్!
వెనక్కి తిరిగి చూస్తే,
భౌతిక దూరాలు వాస్తవాలయ్యేయి!
అక్కున చేర్చుకునే ఆత్మీయతలు మాత్రం
అధివాస్తవాలవుతున్నాయంటావా?!
లేదు…
ప్రవాహపు ఒడిలోనే ఉన్నావు,
ఒడ్డుచేరేందుకు సమయముంది!
కాస్తంత ఓరిమితో నీటి వాలునే కదులు,
దారిపొడవునా నిన్నంటే నీటి బిందువులు మాత్రం
సున్నితంగానైనా విదిలించెయ్యాలి సుమా!
Thank u anudeep
LikeLike