* * *
ఈ సాయంసంధ్య మనసునెందుకో తడువుతోంది,
శూన్యంలోకి సారించిన చూపులు అప్రయత్నంగా చిక్కుపడ్డాయి
అభావంగా ఉన్న మనసులో చలనం!.. సంచలనం!
దూరంగా, కనుచూపుమేరలో పెంకుల కప్పు కూలుతూ ఓ ‘బడి’
లేత వెన్నెల కాంతిలో ఆ శిధిలాల మధ్య పరుచుకున్న మిలమిలలు!
ఒకర్నొకరు తోసుకుంటూ, బడిగంటకు తూనీగల్లా పరుగులు తీసిన చిన్నారులు,
ఎప్పటిదో పాతఫోటో ఫ్రేమ్ లా………….అయినా స్పష్టంగా…………..
ఎందుకో ఈ చిత్రం ఇంత సజీవంగా ఉంది?!
అనుభవాల రుతువులన్నీఆవాహన చేసుకుని,
పరిపూర్ణత్వంతో వెలుగుతున్నఈ జీవితం
బ్రతుకుపుస్తకాన్ని ఆఖరిపుట వరకూ చదువుకుంటూ వస్తూ
నిశ్శబ్దం ఘనీభవించిన ఆ గతపు వాకిళ్లను తట్టి చూస్తూ ఈ మైమరపు ఎందుకో!
బహుశా ఆ మనసునంటిన బాల్యపు మరకలు పోలేదు!
అవి చిరంజీవులు!
Thank u anudeep
LikeLike