* * *
మనసు, మాయ పర్యాయ పదాలని తెలుసు
మళ్లీ మళ్లీ రంగురంగుల ఆశ నిరాశల్నిఅద్దుతుంటాయనీ తెలుసు!
నారింజరంగు సూర్యోదయాలు చైతన్య రహదారుల్ని పరుస్తుంటే,
ఊదారంగు సాయంత్రాలు మాత్రం గుండె నిండా గుబులు మబ్బుల్ని నింపుతూ ఉంటాయి!
అయినా…………..
అన్ని రుతువులతో సహవాసం చేసే పెరటి పచ్చదనం ఎర్రెర్రని ఆశల్ని పూస్తూనే ఉంటుంది!
ప్రకృతి పంచే సందేశాల విందు వెన్నంటి ఉండే ఆర్ధ్రతవుతుంది!
తూర్పున బయలుదేరిన ఉత్సాహం పడమటి దిక్కుగా నిస్త్రాణ అవుతుంది!
నిశీధి నిశ్శబ్దం అలుపు తీర్చే లాలిపాటవుతుంది!
నిద్దట్లో పాపాయి అమ్మని పెనవేసుకునే అనురాగమవుతుంది!
ఆర్చుకుపోయిన మనశ్శరీరాలకు ఇల్లు ఆత్మీయబంధువవుతుంది!