పురాతన జ్ఞాపకం

* * *

సూర్యాస్తమయం వెంటనే సూర్యోదయాన్ని ఎవరైనా చూసేరా?
ఇడిగో, సప్త రథాల్నెక్కి మరీ వచ్చాడు ఈ బుల్లి అతిథి!
వెలుతురు పారిజాతాల్ని మూటగట్టి మరీ తెచ్చాడు!
ఆ నల్లని కనుపాపలు ప్రపంచాన్ని విస్మయంగా పరికిస్తుంటాయి!
ఏవో రహస్యాల్ని చెప్పాలన్నట్టు విడివడని గుప్పెళ్లు ఊరిస్తుంటాయి!
ఒకే ఒక్కసారి……….వాడి సమీపానికొచ్చామా!….
వాడి మాయలో పడకూడదన్న నిబంధనలేమీ పనిచెయ్యవు!
తన అస్తిత్వాన్ని ప్రదర్శించే ఆ చేతులు, కాళ్లు చేసే విన్యాసాలు ఏ నృత్య రీతులకి అందుతాయి?

సూర్యుడి చుట్టు భూమిలా, వాడి చుట్టూ తిరిగే మమ్మల్ని, మా మాటల్ని, ఆలోచనల్ని
ఆ చిరుపెదాలు పసిగట్టి చిరునవ్వుల బహుమతుల్నిస్తుంటాయి!
అంతలోనే మూసుకున్న ఆ పెదవుల వెనుక భూగోళం అంత గుట్టేదోఉన్నట్టే ఉంటుంది!
వాణ్ణి చూసిన క్షణం ఒక పురాతన జ్ఞాపకమేదో వెంటాడుతుంది!
వాణ్ణి వివరించేందుకు నాకు భాషేం తెలుసుననీ?!

* * *

 

 

 

 

3 thoughts on “పురాతన జ్ఞాపకం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.