* * *
అనుకున్నంతా అయింది, నిండా మూడేళ్ళు లేవు,
అమ్మని, నాన్ననీ సరే, నానమ్మనీ ఆవాహన చేసేసుకుంది చూడు!
తాతయ్యదే కాదూ అసలు తప్పు……….
పాపాయి తలుచుకున్నప్పుడు, తలుచుకోనప్పుడు కూడా
పాపాయి వెంట పరుగెట్టేందుకు ప్రయాణ మవుతుంటే వద్దని మరి చెప్పొద్దూ ?!
అంటే పూర్తిగా తప్పు పాపాయిదీ కాదు,
ఆ మెత్తని స్పర్శ, ఆ మెరిసే కళ్ళు
ఆ చిట్టి పలుకులు, ఆ అల్లరి పరుగులు,
ఆ కథ చెప్పించుకునే వైనం ……………..
అవునులే,
నాకు తెలుసు !
అదంతా ఒక మాయ ! ఎవరికి తెలియనిదనీ ?!
Simply superb
LikeLike
Thank u for liking the poem
LikeLike