* * *
ఎవరో, ఎక్కడివాడో తెలియదు,
చటుక్కున రాక తప్పదనుకున్న గాలివానలాగే వచ్చాడు!
వాడి చూపులు నన్ను చుట్టుకునే ఉంటాయి, నన్ను శిలువని చేస్తుంటాయి!
అంతలోనే దిగంతాల్లో ఏ అగోచర దృశ్యాల్నోదర్శిస్తుంటాయి.
నాపిలుపుకే విచ్చుకున్నట్లుంటాయి ఆ పెదవులు!
ఏ భాషకీ అందని ఎన్నెన్నో సందేశాల్ని అందిస్తుంటాయి ఆ నవ్వులు!
ఆ వేలి కొసలు ఏ మాయా మోహాల్నో నాలో ఒణికింపచేస్తుంటాయి!
ఏ రాగాలకీ అందని సుస్వరాల్ని ఎక్కణ్ణుంచో అవలీలగా ప్రవహింపచేస్తుంటాయి!
వీడోక పాటా? వీడొక ప్రవాహమా?
వీడొక భావమా? వీడొక స్పర్శా?
వీడొక సందేశమా? ఏమో?!
వీణ్ణీ చూస్తే యుగయుగాల దుఃఖం!
వీణ్ణి హత్తుకునే ఉండాలని ఎందుకో తపన!
అవును, వీడొచ్చాక స్థిమితమే లేదు!
Abbha entha baavundo….the poem and anuradha’s emotion.. I wish I were Ky to get all the love!!!
LikeLike