* * *
- కిటికీ వారగా
తెలవారింది
నైట్ క్వీన్ నిద్రపోయింది.
- సమాంతర రేఖల మీద
సమైక్యతా రాగాలు
రైలొచ్చింది.
- ఆకాశాన తెలిమబ్బు
నేలింకిన నదీపాయ,
గ్రీష్మం.
- బావురుమనే వాకిలి
మినుకుమనే ఆశాతోరణం
నిరీక్షణ.
- ఫాగ్ చలి చుట్టుకున్న
ఇండియా గేట్
భవిష్య దర్శనం.
- చౌరస్తా బ్రహ్మరథం
యాక్సిడెంట్ కేకైంది
ట్రాఫిక్ జామ్.
- కాలుష్యం ఘనీభవించింది
ప్రవహించే జ్ఞాపకం
తాజ్ మహల్.