* * *
నువ్వొస్తున్నావట!
ఔను, పాత ఉక్రోషాలన్నీ మర్చేపోయిందీ మనసు!
వచ్చేస్తున్నావ్, నాకు తెలుసు.
వేల మైళ్ల దూరాన్ని మనో వేగంతో ముందే దాటేస్తావ్,
ఇంతలోనే నడి ప్రయాణపు పలకరింపువవుతావు.
ఒట్ఠి పిచ్చివాడివి!
సమాంతరంగా నీతో ప్రయాణం చేస్తూనే ఉన్నానన్న వాస్తవం మరిచేపోతావ్!
ఓహ్,నిజంగా వచ్చావ్.
అదే మబ్బుపట్టిన సాయంకాలం, అదే ఎదురుచూపుల వాకిలి!
ఆ కాసిని మెట్లూ అధిగమించలేని అలసట నీ అడుగుల్లో!
నీ ముఖంలో ఒక దైన్యం!
మాటల దొంతరలు పేర్చని ఓ నిశ్శబ్దం!
ఆ కళ్లల్లో ఏదో వెదకబోయి అర్థం కాక నిలబడ్డాను!
ప్రకృతి వాయిద్యాలని శ్వాసించే నేను!