దేవుడు మాస్టారు-మౌనం – గూడెం చెప్పిన కథలు – సారంగ Jun, 2016

* * * JUNE 16, 2016 9 COMMENTS క్లాసులు బాగానే జరుగుతున్నాయి. ఎవరమూ ఊహించని సంఖ్యలో పిల్లలు రావడం మొదలు పెట్టేరు. వాళ్ల ఇంటి చుట్టుప్రక్కల ఉన్న పిల్లల్ని మరికొంతమందిని కూడా తీసుకురావడం మొదలు పెట్టేరు. నా ఆత్మ విశ్వాసం ఆకాశం ఎత్తుకు పెరిగిపోయింది. రోజూ వెళ్లేప్పుడో, వచ్చేప్పుడో దేవుడు మాస్టారు కనిపిస్తూనే ఉన్నారు. నేను నమస్కారం పెట్టంగానే ఆయనా బదులుగా నవ్వుతూ తల ఊపి తన నడక సాగిస్తుంటారు. సాయంకాలాలు నేను వెళ్లే సరికి …

Continue reading దేవుడు మాస్టారు-మౌనం – గూడెం చెప్పిన కథలు – సారంగ Jun, 2016

టెన్సెస్-కాలాలు – గూడెం చెప్పిన కథలు – సారంగ Aug, 2016

* * * AUGUST 3, 2016 4 COMMENTS రోజూ గూడెంలో నేను ఎదురు పడినప్పుడల్లా రోషిణి, దీపిక, సుష్మ, ప్రమీల, జయశ్రీ, సౌజన్య నవ్వుతూ నన్ను దాటి వెళ్లిపోతుండేవారు. పదో క్లాసు కావటంతో స్కూలు సమయం దాటాక ప్రత్యేక క్లాసులు మరో రెండు గంటలు పాటు జరుగుతాయి వాళ్లకి. ఎప్పుడైనా క్లాసులు లేనప్పుడు కాస్త తొందరగా వచ్చినా గూడెం లో క్లాసుకి వచ్చేవాళ్లు కాదు. తాము పదో క్లాసు పిల్లలు కనుక తమకో ప్రత్యేక హోదా …

Continue reading టెన్సెస్-కాలాలు – గూడెం చెప్పిన కథలు – సారంగ Aug, 2016

పరిమళపు అర – కౌముది Jul, 2016, రచన ఇంటింటి పత్రిక Jul, 2017

* * * ప్రొద్దున్నే శారద తయారవుతున్నంతసేపూ ఆరాటంగా ఇల్లంతా తిరుగాడుతున్న సరస్వతమ్మ, ‘వెళ్లొస్తానమ్మా, జాగ్రత్త. భోజనం చేసి కాస్సేపు నిద్రపో. ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి’ అంటూ ఆమె ఆఫీసుకి వెళ్లిపోయాక వరండాలో కాస్సేపు కూర్చుని ఆనాటి దిన పత్రికను చదివే ప్రయత్నం చేసింది. మనసు నిమగ్నం కాలేదు. కొన్నాళ్లుగా ఆవిడకి ఆరోగ్యం బావుండటంలేదు. ఎప్పుడూ కడుపునొప్పనో,కడుపులో మంటనో బాధపడుతోంది. తన పనులు తను చేసుకుందుకు కూడా ఓపిక లేనట్టు తల్లి పడుతున్న అవస్థ శారద చూస్తూనే ఉంది. ఆవిడకి అలవాటైన …

Continue reading పరిమళపు అర – కౌముది Jul, 2016, రచన ఇంటింటి పత్రిక Jul, 2017

క్వీన్ – సారంగ Jan, 2016

* * * క్వీన్ ~ అనూరాధ నాదెళ్ళJANUARY 28, 2016 37 COMMENTS                    -నాదెళ్ళ అనూరాధ ~ పూణె నగరం అందమైనది అని ప్రత్యేకంగా చెప్పేందుకేముంది? చుట్టూ చిక్కనైన ప్రకృతి పరుచుకుని కొండల్లోకో, అడవుల్లోకో, సరస్సుల్లోకో మనలని ప్రయాణించేలా చేస్తుంది. ఆ అందాల్ని ఏ కవి మాత్రం వర్ణించగలడు? చూసే కళ్లకి, ఆస్వాదించే మనసుకీ మాటలు రావు మరి. నగరంలో ఒకపక్క పశ్చిమదేశాల నాగరికత స్పష్టంగా …

Continue reading క్వీన్ – సారంగ Jan, 2016

“పాణిగ్రహణం-పదిరోజుల్లో” పుస్తక మహోత్సవం Jan, 2016

                    * * * ఈ రోజు మనం శ్రీమతి గోవిందరాజు మాధురి గారి ‘పాణిగ్రహణం-పదిరోజుల్లో’ అనే కథల పుస్తకాన్ని గురించి మాట్లాడు కుంటున్నాం. ఈ సంపుటిలో పది కథలున్నాయి. అన్నీ కూడా అత్తగారు, కోడలు కలిసిమెలిసి ఉన్న ఉమ్మడి కుటుంబపు కథలే. అత్తలేని కోడలు ఉత్తమురాలు అనికాని, కోడలులేని అత్త గుణవంతురాలు అనికాని అంటే ఈ కథల్లోని అత్తాకోడళ్ళు ఒప్పుకోరు. వారి మధ్య …

Continue reading “పాణిగ్రహణం-పదిరోజుల్లో” పుస్తక మహోత్సవం Jan, 2016