* * *
FEBRUARY 10, 2016 23 COMMENTS
గూడెం పరిసరాలు అలవాటు అవుతున్నాయి. మొదట్లో కుతుహలంగా, ఆరాగా, సంశయంగా నన్ను, నారాకని వెంటాడే చూపులు మెల్లి మెల్లిగా స్నేహంగా, ఎదురుచూస్తున్నట్లుగా ఉంటున్నాయి. నాకు కూడా ఇప్పుడు ఆ పరిసరాలు ఎంతో ఆత్మీయంగా అనిపిస్తున్నాయి. ఆ పిల్లలు చదువుకోవటం కోసం ఏదైనా చెయ్యాలని ఇష్టంగానే మొదలు పెట్టినా నా రాకని అక్కడ ఎంతవరకూ ఆహ్వానిస్తారో అన్న కొద్దిపాటి జంకు మాత్రం మొదట్లో ఉండేది .
ఇప్పుడైతే అది నా సామ్రాజ్యం అన్నంత ధీమా ! దారి పొడవునా పలకరింపులు కి సమాధానాలు చెబుతూ వెళ్లటం అలవాటైపోయింది .
‘టీచరమ్మా, అప్పుడే వస్తున్నావూ? ఇంటికెళ్ళి కాస్త టీ నీళ్ళన్నా తాగొస్తున్నావా లేదా?’ చేటలో బియ్యం చెరుగుతూ ఆ పెద్దావిడ ఎప్పటిలాగే పలకరించింది. సమాధానంగా తలూపేను.
స్కూలు నుండి వస్తూనే పుస్తకాల సంచీలు గుమ్మాల్లోకి విసిరి, రోడ్డు మీద ఆటల్లో మునిగిపోయిన పిల్లలు మాత్రం ‘టీచర్, ఇప్పుడే వస్తాం’ అని ఓ కేక పెట్టేరు అయిష్టంగానే. తనకు తెలుసు వాళ్లకి ఆటలు ఎంత ఇష్టమో! అసలు ఆటలు వాళ్ల హక్కు కాదూ? కానీ… చదువుకోవద్దూ !
వీధి కుళాయిల దగ్గర స్కూలు యూని ఫారాల్లొ ఉన్న ఆడపిల్లలు, ఒకరిద్దరు మగ పిల్లలు నీళ్లు పడుతూ ఇబ్బందిగానే నవ్వు ముఖాలు పెట్టేరు .
వీళ్ళకి ఇంకో అరగంట పడుతుంది పనులు తెముల్చుకు వచ్చేందుకు. ఈలోగా చిన్న పిల్లల చేత అక్షరాలు దిద్దించి వాళ్లని పంపెయ్యాలి . క్లాసుకోసం కేటాయించిన వరండాలోకి చేరేను . నన్ను చూస్తూనే సుమజ పరుగెత్తుకెళ్లి కుర్చీ తెచ్చివేసింది . పాస్టర్ గారింట్లో దాచి పెట్టిన చాపలు తెచ్చి పరిచింది . మైఖేల్ పరుగెత్తుకుంటూ వెళ్లి బోర్డ్ తెచ్చి గోడకి తగిలించాడు.
ఎవరూ చెప్పకుండానే ఎంతో సహజంగా వాళ్లు అవన్నీ అమర్చేసేరు . ఈ పిల్లలు ఏదైనా సాయం చెయ్యాలంటే ఎవరికోసమైనా సరే ముందు ఉంటారు . బహుశా పెద్దలనుండి చూసి నేర్చుకుంటున్నారేమో ! సహజీవనం అనే మాటకి సరి అయిన అర్థం ఇస్తున్నాయి గూడెంలో నేను చూస్తున్న జీవితాలు. బయటి నాగరిక ప్రపంచం కంటే ఇక్కడ మనుషుల మనసులు విశాలమనిపిస్తూంది.
అరగంట గడిచి, మెల్లిగా పెద్ద పిల్లలు రావటం మొదలైంది . అటెండెన్స్ తీసుకుంటూంటే రాజు క్లాసులో లేకపోవటం గమనించేను . నిన్నా రాలేదు . ఏమైంది? అడుగుదామని తలెత్తితే వరండా ప్రక్కనుంచి సైకిల్ నడిపించుకుంటూ వెళ్తున్నాడు .
‘ రాజూ, క్లాసుకి టైమైంది , పుస్తకాలు తెచ్చుకో’ క్రితం రోజు విషయం మాట్లాడకుండా పిలిచేను.
‘రేపొస్తాను టీచర్, సెంటర్ దాకా వెళ్లాలి, సైకిల్ పంక్చర్ పడింది. ‘
‘క్లాసు అయ్యేక బాగు చేయించుకో . నిన్న కూడా నువ్వు రాలేదు’ సీరియస్ గానే చెప్పేను.
‘ఈ రోజు రాను టీచర్ ‘ అంటూనే వాడు సైకిల్ పట్టుకుని ముందుకెళ్లిపోతున్నాడు. క్లాసులో పిల్లలంతా పుస్తకాల్లోంచి తలలు పైకెత్తి చూస్తున్నారు . జాన్ చెబుతున్నాడు,
‘ టీచర్, నిన్న రాత్రి రాజుని వాళ్ల నాన్న బాగా కొట్టేడు సైకిల్ బాగు చేయించలేదని.’
పిల్లల్ని పిల్లల్లా చూడరే ఇక్కడ. వాళ్లు కూడా పెద్దల్లాఉండాలి. ఇంటి జరుగుబాటులో పెద్దలతో సమంగా బాధ్యత తీసుకోవాలి. వాళ్లకి పిల్లలుగా హక్కులు ఏవీ లేవు. పుడుతూనే బాధ్యతలతో పుడతారు. పైగా ఇంటికి కనీసం ముగ్గురు లేదా నలుగురు పిల్లలు. ఆలోచనల్లోంచి ఉలిక్కిపడ్డాను……………………………..
వెనుక నుంచి పెద్ద కేక ! వెనకింటి వరండాలో ఉన్న ఒక వ్యక్తి బయటకొచ్చాడు,
‘ మేష్టరమ్మా, నువ్వు ఉండు. నేను చెబుతా వాడికి ‘ ,అంటూనే ‘అరేయ్, మేష్టరమ్మ పిలుస్తూంటే వినబడ్డంలా?’ అంటూనే వంగి నేల మీద దేనికోసమో వెదికేడు, మరు క్షణం అతని చేతిలో ఒక పెద్ద రాయి ! ఏం జరుగుతోందో నాకు అర్థం అయ్యేలోపు అతను ఆ రాయిని రాజు మీదకి విసిరి ముందుకు పరుగెత్తాడు. సైకిల్ ప్రక్కన పడేసి, నేల మీద మరో రాయి అందుకుని రాజు అంతే వేగంగా దాన్ని వెనక్కి విసరడం, వెంటనే పరుగున వీధి మలుపు తిరగడం జరిగిపోయేయి .
నేను ఏంచూసేను ?! క్షణ కాలం మనసు మొద్దుబారింది.
రచయిత్రి గారు గత కొద్ది రోజులు గా గూడెం పిల్లలకి పాఠాలు చెప్పడం మరి యు ఆవిడ వెళ్ళుతున్న దారిలో వారు వినయంగా పలకరించండం చక్కగా వివరించారు. సమాజం లో బాలలతో పని చేమ్చడం తప్పు అని తెలిసిన తన కుటుంబ అవసరాల దృష్ట్యా వారిని పనికి పంపి అటు పిమ్మట వారికీ ఎటువంటి స్వేఛ్చ ఇమ్మకుండా వారికీ మరిన్ని పనులు అప్పగించడం బాధ కలిగించింది.వాళ్ళ బావోద్వేగాలు టీచర్ నిసహాయత కధను సహజం గా రూపొందించారు.
Very emotional story. I felt like I was inside the gudem and saw all that happened. How sad but how real are these stories. Responsibilities make those kids tough at a very early age. They are not privileged to enjoy childhood.
రచయిత్రి గారు , వాస్తవానికి దగ్గరగా ఉన్న పరిస్థితులు ఎంచుకున్నారు. నిత్యం కనపడే సంఘటనలు కధానిక లా మన ముందుంచారు. కధలో పాత్రలు వయసులో చిన్నవే అయినా , పరిస్థితులకు ప్రతిస్పందించే తీరు మనకు పరిచితమే. దీనితో పాథకులకు కధ దగ్గర అవుతుంది , కధలో తమని భాగంగా ఊహించుకుంటారు. బాగుంది.
గూడెం కధలు ప్రతి ఎపిసోడ్ ఎంతో బాగా వర్ణిస్తున్నారు రచయిత్రిగారు .ఈ చిట్టి కధలు Chala ఆలోచిమ్పచేస్తున్నాయి .
చిట్టి చిట్టి కధలు చిన్నారుల జీవితాలు గూడెం లో పెద్దల ఆకతాయి తనం చక్కగా కళ్ళకి కట్టినట్టుగా వర్నించారు. చాలాబాగున్నాయి గూడెం కధలు. తరువాయి కధ కోసం ఎదురుచుస్తున్నాము. కీప్ ఇట్ అప్.
అనురాధగారి కధ చదువుతుంటే అంతా మన కళ్ళముందు చూస్తున్నట్లుగా వుంది ఆ స్తితిలోపిల్లలు అలానే ప్రవర్తిస్తారేమో అనిపించింది .రచయిత్రి నిస్సహాయతను కధలో ప్రతిబింబించిన విధానము బాగుంది. gudemu కధలద్వార వాస్తవాలను తెలియచెప్పే ప్రయత్నము చేస్తున్నారు
చాలా బాగా ఎన్నో విషయాలను ఈ కథలో చూపించేరు. ఎక్కువగా ఆకర్షించింది ఏమిటంటే – ‘పిల్లల్ని పిల్లల్లా చూడరే ఇక్కడ. వాళ్లు కూడా పెద్దల్లాఉండాలి. ఇంటి జరుగుబాటులో పెద్దలతో సమంగా బాధ్యత తీసుకోవాలి. వాళ్లకి పిల్లలుగా హక్కులు ఏవీ లేవు. పుడుతూనే బాధ్యతలతో పుడతారు’ అన్నది ఎంతో ఆలోచింప చేస్తుంది. గూడెం జీవితాలకి మన జీవితాలకి ఎంత తేడా ఉంది. మనం పిల్లలని నలభై ఏళ్ళు వచ్చినా సలహాలు ఇస్తూనే ఉంటాము. వాళ్ళకంటూ ఒక ఆలోచన లేకుండా, ప్రతి అడుగులో అడుగు వేసి నడిపిస్తాము. very nicely written .
ఒక చిన్న ఇన్సిడెంట్ ని ఎంతో సున్నితం గా రాయడమే కాకుండా ఒక పెద్ద సమస్యను కళ్ళకు కట్టినట్టు మన ముందు ఉంచారు ఈ కథలో. ‘ఇక్కడ రాళ్ళు కూడా మాట్లాడుతాయి’ అన్నిది ఎంత నిజం!!
రాజు విసిరిన రాయి నాకే తగిలినంతగా మొద్దుబారింది నా అచేతనం. పెద్ద వాళ్ళ చేతి లోని రాళ్ళు కేకలు పెడితే ..పిల్లల చేతిలోని రాళ్ళు కత్తులు దూస్తాయి. రచయిత్రి చాలా ముఖ్యమైన అంశం మీద దృష్టి మరలేలా పదునైన ముగింపు ఇచ్చారు. అది పిల్లల హక్కులు అన్న అంశం. ప్రాధమిక హక్కులలో విద్య అన్నది వున్నపుడు, పిల్లల జీవితంలో ” ఆట పాటలు ” అన్న హక్కు ని తొలగించే అధికారం ఎవరికుంది ? ఈ సమస్యకి పరిష్కారం సులభమైనది కాదు. పిల్లల ఎదుగుదలలో కుటుంబం, సంఘం, ఎన్విరాన్మెంట్ ..ఇలా అనేకమైన విషయాలలో మార్పులు రావాలి. అంత వరకు ఇలాంటి కధలు ..చర్చలు తప్పవేమో. రచయిత్రికి మనసారా కృతజ్ఞతలు.
మేడం గారు కథలో పరిస్థితిని బాగా వర్ణించేరు. కాని రాజు తిరిగి రాయి విసరడం బాగా లేదు. ఆ వ్యక్తి చడువుకున్నదో లేదో తెలియదు కాని రాజు స్కూల్ కి వెళ్తున్నాడు కదా ,కనీసం వాడు అలా చెయ్యకుండా ఉండవలసింది. అలాంటి మార్పే మనం చూడాలని చదువుకి ప్రాముఖ్యత ఇస్తున్నాం.
చిన్న పిల్లలు తప్పటడుగులు సున్నితంగా ఎలా చూస్తామో అలాగే గూడెం లోని ప్రతి సంఘటనకీ ఎంతో సున్నితంగా స్పందిస్తూ రాస్తున్న ఈ గూడెం కథలు మంచి స్పూర్తిని ఇస్తున్నాయి. చంటి గారు రాసినట్టు, ‘చిన్న సంఘటనే ఎంత మొరటుగా తేలింది’ ! వాణి గారు రాసినట్టు రాజు విసిరిన రాయి నాకే తగిలినట్టు అనిపించింది.
‘ప్రేమ కి ప్రేమ’ , ‘రాయి కి రాయి’ అని మనం ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు పిల్లలు. ముందు పెద్ద వాళ్ళ మనస్తత్వం మారాలి. వాని గారు రాసినట్టు పెద్ద వాళ్ళ చేతి లోని రాళ్ళు కేకలు పెడితే ..పిల్లల చేతిలో కత్తులు దూస్తాయి. దీనికి కారణం ఏమిటి , చదువు లేకపోవడమా , పేదరికమా ? క్రమశిక్షణ, మర్యాద,గౌరవాలు చదువుతోనే వస్తాయా? ఏది ఏమైనా పిల్లల మనసులు దెబ్బ తింటున్నాయి. కధ ముందు భాగం ఎంతో క్యూట్ గా ఉంది కాని చివరి భాగం ఎంతో భయం గా వాస్తవాన్ని చూపించింది. రాజు రాయి తో పాటు ఈ వాస్తవం కుడా ఒక పెద్ద రాయే
టౌన్ లో పుట్టి , సిటీ లో స్థిరపడ్డ నాలాంటి వాళ్ళు ఇలాంటివి సినిమాల్లో చూడడమే తప్ప నిజ జీవితం లో ఎదురు పడలేదు. ప్రాణాలు ఇవ్వడానికి ,ప్రాణాలు తియ్యడానికి అడుగు వెనక్కి వెయ్యరు వీళ్ళు. ఎంతో కళ్ళకి కట్టినట్టు ఇన్సిడెంట్ రాయడం ఒక రచయత్రి కె వస్తుంది. మొదటి లైన్ నుండి చివరి లైన్ వరకు ఎంతో ఆసక్తి గా రాసేరు. వచ్చే నెల శీర్షిక కోసం ఎదురు చూస్తూ …అభినందనలు.
రోజు గూడెం లోకి వెళ్లి టీచింగ్ చెపుతూ చిన్న చిన్న విషయాలు గమనిస్తూ వాటి వల్ల వచ్చే ఆనందాన్ని మనతో పంచుకోవడమే కాకుండా , కొన్ని అనర్ధాలు కుడా గుర్తించి మన ముందుకు తెస్తున్న ఈ గూడెం కధలు simple but thorough గా ఉన్నాయి. Keep writing .
children are just like sponges. They absorb whatever they see around them , imitate people ,often their parents but also others.రాజు చిన్న పిల్లవాడు, మంచి చెడు మధ్య తేడా తెలియని వయసు. చాల obedient గ తండ్రి చెప్పిన పని చెయ్యడానికి వెళ్ళుతున్నాడు.
గూడెం లో పెద్ద వాళ్ళు ముందు moral values and ethics నేర్చుకోవాలి.
ప్రతి కధ లోని society లో కనబడుతున్న problems ని రైటర్ గుర్తించి వాటికీ solutions వెతుకుతున్నారు . good effort
Gooemkathalu is very intereting to read it. Pillalu peddavallanu prathi nimisam anukaristaru anadaniki raju chethiloni raye nidarsanam. Sunnitamuga cheppe vishayaniki kuda as gramasthudu himsane ennukunnadu daniki himse badulayindi . next story kosam atrutatho eduruchustunna.
మనం ఏది ఐన ఒక పని లో నిమగ్నం ఐతే అలాగే వుంటుంది అందరూ మనవారే అని అప్పుడే మన పనిని ఎంతో క్రమసిషణ తో చేయగలం. అది టీచర్ గా బాగా చెప్పారు. రచయిత్రి గా కథ లో రాజు వచ్చిన తరవాత అతని ప్రవర్తన టీచర్ ఏమి చేయలేని పరిస్థితి ని బాగా వివరించారు. ఎదురుకుండా వుండి చూస్తూ వునట్లుగా రాయడం చాలా గ్రేట్, రచయత్రి అనురాధ కి హాట్స్ హఫే .
మనసుకి హత్తుకునేల ఆలోచింపచేసేలా ఉంది కధనం బాగుంది కరుడుగట్టిన నేరాలకి పునాది ఇక్కడే పడుతోన్దిసుమ అనిహెచ్చరించేల ఉంది ఈ సమస్యలకి మనమేమి చెయ్యలేమ అనే దిశగా ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది ఇది విమర్శ కాదు పరిష్కారం లేని సమస్యలు కన్నీళ్ళు తెప్పిస్తాయి తప్ప ఏమి లాభం సమస్యని మన Mundu ఉంచడంలో రచయిత్రి కృషి అమోఘం
గూడెం చెప్పిన కథల్నిచదివి అభిప్రాయాల్ని తెలియజేస్తున్నఫ్రెండ్స్ అందరికీ ముందుగా థాంక్స్. రాజు విసిరిన రాయి నిజంగా మీ మనసుల్ని తాకింది కదూ. ఆ పిల్లవాడికి అలాటి ఆలోచనను నేర్పిన పెద్దలను ఎలా మార్చాలి?ఆ పెద్దలకి అలాటి ఆలోచన ఎలా వచ్చింది? అమాయకంగా, ఎలాటి చెడు ఆలోచనలూ లేని పసివాడికి పెద్దలు ఏం నేర్పుతున్నారు? ఈ రోజు నేను క్లాసుకి వెళ్ళేసరికి ఆ విశాలమైన కమ్యూనిటీ హాలు కిటికీ రెక్కలకున్న గాజు పలకల్ని పగలకొట్టి గాజు సీసాలను ( ఖాళీ లిక్కర్ సీసాలు) హాల్లోకి విసిరేశారు ఎవరో! పిల్లలు ఎందుకు టీచర్ అలా సీసాలు విసిరేరు అని అడిగేరు.ఏమో, ఏం చెప్పను?పిల్లలు చీపురు తెచ్చి జాగ్రత్తగా తుడిచి,ఎత్తి పారేసేరు.ఎవరిని అడగాలి? ఎవరు జవాబు చెబుతారు?
ప్రతి రోజూ ఒక కొత్త సమస్య తెచ్చిపెడతారు. అక్కడ అందరూ పెద్దలే. కానీ ఎవరికీ ఏ బాధ్యతా లేదు. ఆ పిల్లల మీద ఎన్నెన్ని ప్రభావాలో! మన ఇళ్లల్లో పిల్లల్ని వెయ్యికళ్లతో కాచుకుంటూ పెంచుకుంటాం. కానీ వీళ్లని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియటం లేదు. రోజూ చదువుకుంటే ఎంత బావుంటుందో చెబుతున్నావాళ్లకి నా మాటలమీద గురి కుదరాలి కదా. అలాటి ఒక ఆలోచన వైపుగా వాళ్లను మళ్లించే వాతావరణం అక్కడ ఎప్పటికి వస్తుందో! చూద్దాం.మీరంతా నాతోపాటు ఆలోచిస్తున్నారు కదా. అది నాకు చాలా బలాన్నిస్తోంది.థాంక్యూ వన్స్ ఎగైన్…..అనూరాధ
ఆధునిక కాలం లో రోజూ ఒక కొత్త సమస్య కనబడుతుంది . అందరూ పెద్దలే. కానీ ఎవరికీ ఏ బాధ్యతా లేదు. గూడెం లో ఉన్న పిల్లల మీద ఎన్నెన్ని ప్రభావాలోగూడెం కధలు ప్రతి ఎపిసోడ్ ఎంతో బాగా వర్ణిస్తున్నారు. గూడెం లో పెద్ద వాళ్ళు ముందు సమజికవిలువలు నేర్చుకోవాలి. ప్రతి కధ లో సమాజం లో కనబడుతున్న problems ని రైటర్ గుర్తించి వాటికీ solutions వెతుకుతున్నారు . good effort.ఈ చిట్టి కధలు మనందరినీ ఆలోచిమ్పచేస్తున్నాయి .
బావుంది కథ, irrational behavior చదువు కున్న వాళ్ళు distractions కి లోను అయ్యి చూపిస్తారు. చదువు రాణి వాళ్ళు imitation తో. కథ లాస్ట్ లో మలుపు తిరిగి, హటాత్తుగా నిజ జీవితం ఇలాగే ఉంటుందని గ్రహిమ్పచేసే లా వుంది. Visuals బావున్న్నాయి, ఇంకొంచం దారి పొడుగునా నదుస్తూ వెళుతుంటే వచ్చి పోయే వాహనాలు, పశువులు వాటి descriptions చూపిస్తే మరింత బావుంటుంది situation blueprint .
EDI kadha kaadu, Nizam. Raju chesina pani gudemlone kadu caalamandi ellallo kuda jarugutunnai EE kalamlo. Raju cesinadi anukarana matrame. Adi mancha ceda annadi taruvata vishayam. Adi intlo parents meeda aadharapadivundi ani naa abhiprayam. Deeniki caduvu kontamera upayogapadutundi. Pillalaku manam icce bahumati samskarammatrame. Adi nerpadaniki meeru cestunna krushi abinandaneeyam.
Rachayita katha nu cheppina vidhaanam chaala baagundhi.ituvanti vishayalu inka India lo jarugutunnayante nammasakyanga ledhu.idhi pillala behaviour lo lopamo ledha penchadam chetakakapovadamo ardham kaavatledhu.but anyways nice story.