కలల మొలకలు – కౌముది Oct, 2013

* * * కలలు మొలకెత్తిన మొన్న లేవీ? వాటిని నెమరేసిన నిన్నలేవీ? మట్టి పెళ్లల వెచ్చని ఒడిలో ఒదిగి చూసే కలల కలవరింతల విత్తులేవీ? అస్తమయ సూర్యుడితో గుసగుస లాడుతున్నాయా? నాలుగు దిక్కులా చేతులు చాచి, భూమిని, ఆకాశాన్ని, పులుముకున్న మాయనీ, పలకరించే గాలినీ ,ప్రవహించే మబ్బునీ, పరవశం గా చుట్టుకుని,  లోవెలుగుల జాడల్ని వెతుక్కుంటున్నాయా? * * *

పరిమళం – ఆకాశవాణి, కౌముది Aug, 2015

* * * తెల్లవారి లేస్తూనే గుమ్మం ముందు పాల ప్యాకెట్ తీసుకుంటూ, ఇంటి కాంపౌండ్ లోనూ, బయటా అరడజను పైగా స్కూటర్లు ఉండటం గమనించింది శారద. విషయం అర్థం కాలేదు. తలుపు మూసి పనుల్లో పడిన శారద ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి.క్రిందపోర్షన్ లో వాళ్లు వచ్చి మూడు నాలుగు నెలలవుతోంది. ఇంటావిడ రాజమ్మమ్మ పధ్ధతిగా ఉండే మనిషి. ఆవిడ పెట్టే రూల్సన్నీ అద్దెకొచ్చేవాళ్లు ఒప్పుకుని తీరవలసిందే. సిటీలో కొడుకు దగ్గర ఉంటూ, అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్ళు …

Continue reading పరిమళం – ఆకాశవాణి, కౌముది Aug, 2015