* * *
పిల్లల పట్ల ఉన్న ప్రేమ నన్ను టీచర్ని చేసింది. ప్రస్తుతం మా పోరంకి (విజయవాడ)లో చదువు అవసరం ఉన్న ఒక గూడెంలో పిల్లలకి సాయంకాలం పాఠాలు చెబుతున్నాను. ఇది కాకుండా ‘టీచ్ ఫర్ చేంజ్’ అనే స్వచ్చంద సంస్థకు ఈ మధ్య సభ్యురాలిని అయ్యాను. గూడెం ప్రతిరోజూ నాకు క్రొత్త కథని చెబుతూనే ఉంది.
వాడు……
వాడు అందరిలాటి పసివాడే !
ప్రపంచంలోని కోటానుకోట్ల పసివాళ్లకి తోబుట్టువే!
అమ్మకి అందాల చందమామే!
అదే అమాయకపు ముఖం,అదే బాల్యపు చాపల్యం,అవే అల్లరి ప్రశ్నలు !
చుట్టూ ఉన్న ప్రపంచానికి సమానంగా సంతోషాల్ని పంచుతాడు,
నక్షత్రాల్లాటి కళ్లతో చుట్టూ వెలుగులు పూయిస్తాడు!
ప్రపంచం పట్ల తనదైన ముద్రని వేస్తూ, తనవైన నమ్మకాల్ని పెంచుకుంటాడు.
బడిలో కంటే బయటే వాడికి బ్రతుకు పాఠాలు గట్టిగా పట్టుబడతాయి!
మట్టిలో ఆడుతూ, మట్టికీ మనిషికీ ఉన్న ఆత్మీయానుబంధాన్ని నిత్యం నెమరేస్తుంటాడు !
అన్నీ బావున్నాయి, అంతా బావుంది…………………
వాడు రేపటి గురించిన భయం అసలే లేనివాడు!
కానీ వాడు …….. కొందరు పిల్లలకంటే
పుట్టుకనుంచీ ఎక్కువ పోరాటాలతో, ఎక్కువ సమస్యలతో జీవించేవాడు!
సారంగ వెబ్ మ్యాగజైన్ లో ఒక సిరీస్ గా వచ్చిన ఆ కథల్ని ఇక్కడ ఈ బ్లాగ్ లో చదవచ్చు.
ఇక్కడ…….. రాళ్లు కూడా మాట్లాడతాయి!
*
*
*
పుస్తక పరిచయం – కౌముది, జూలై 2017
* * *
